KCR Shock to Kalavakuntla Kavithaవచ్చే నెలలో ఖాళీ అయ్యే 55 రాజ్య సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ కు నాలుగు, తెలంగాణకు రెండు స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి. రెండు రాష్ట్రాలలోని అధికార పార్టీలు వీటిని దక్కించుకుంటాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేసింది.

అయితే తెరాసలో ఈ రెండు సీట్లకు విపరీతమైన పోటీ ఉంది. ప్రధానంగా ఒక్క సీటు కేసీఆర్ కుమార్తె కవితకు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఆ ప్రతిపాదనను కేసీఆర్ పక్కన పెట్టినట్టు సమాచారం. సిట్టింగ్ ఎంపీ కే కేశవరావుకు, ఇంకో సీటు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కంఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. ఈరోజే అధికారిక ప్రకటన రావొచ్చు.

తనకు ఇదే చివరి అవకాశమని, ఈ టర్మ్ తరువాత రాజకీయాల నుండి తప్పుకుంటా అని కేకే చెప్పడంతో కేసీఆర్ కాదని అనలేకపోయారట. ఆశావహులు ఎక్కువగా ఉన్న సమయంలో సొంత కుమార్తెకు అవకాశం ఇస్తే అనవసరమైన వివాదాలు వచ్చే అవకాశాలు ఉండటంతో కేసీఆర్ ఆ ప్రతిపాదనను పక్కన పెట్టారట.

ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కవిత బీజేపీ అభ్యర్థి అరవింద్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అదే విధంగా మండలిలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ సీట్లకు కూడా అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం. గవర్నర్ కోటాలో దేశపతి శ్రీనివాస్ కు, నిజామాబాదు స్థానిక సంస్థల కోటాలో మాజీ స్పీకర్ సురేష్ బాబుకు అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం.