KCR - Chandrababu Naidu-తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా ఇరుకున పెట్టడానికి తెలంగాణలోని అధికార పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. తాజాగా ఒక ఆంగ్ల పత్రికలో ఓటుకు నోటు కేసుకు సంబందించిన ఒక సరికొత్త వీడియో వస్తున్నట్టుగా లీక్ వదిలింది. ఆ తరువాత ఆ వీడియో సాక్షిలో ప్రత్యక్షం అయ్యింది. తార్నాకలోని మాల్కం టేలర్‌ అనే వ్యక్తి ఇంట్లో తీసిన వీడియో బయటికొచ్చింది. 11 నిముషాల నిడివి గల ఈ వీడియోలో టీడీపీ నేత సెబాస్టియన్‌, తెరాస నామినేటేడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను రూ.5 కోట్లకు కొనుగోలు చేసేందుకు బేరసారాలు నడిపారు.

మినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్స్ న్ కు మూడున్నర కోట్లు ఇవ్వడానికి చంద్రబాబు బాబు ఒప్పుకోగా,తాను చెప్పి ఐదు కోట్లకు ఒప్పించానని సెబాస్టియన్ అనే వ్యక్తి చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలతో పాటు మరో నాలుగున్నర కోట్లు ఎక్కడ అంటూ ఈడీ అధికారులు రేవంత్ రెడ్డిని ఇప్పటికే విచారిస్తున్నారు. అప్పటి ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేంద్ర రెడ్డిని కూడా విచారించింది. ఇప్పుడు ఈ వీడియో వల్ల కేసులో పెద్దగా తేడా రాకపోయినా టీడీపీని అభాసుపాలు చెయ్యడానికి విడుదల చేశారు.

గతంలో కూడా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ రికార్డు చేసిన ఈ వీడియో తెరాస కు చెందిన ఛానల్ లో ప్రత్యక్షం అయ్యింది. ఇప్పుడు కూడా విచారణ అధికారుల అధీనంలో ఎప్పటి నుండో ఉన్న ఈ వీడియో సరిగ్గా ఎన్నికల సమయంలోనే విడుదల అయ్యింది అంటే దీని బట్టి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని తెలుస్తుంది. తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినందుకు గానూ రిటర్న్ గిఫ్టు ఇస్తా అని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.