KCR responds on Telangana Inter Resultsతెలంగాణాలో ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకం వల్ల ఎంతో మంది పిల్లలు, వారి తల్లితండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురి అవుతున్నారు. ఇప్పటికే వరకూ ఈ వివాదంపై స్పందించని ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని లీకులు ఇచ్చారు. లితాల్లో నెలకొన్న గందరగోళంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారని ముఖ్యమంత్రి ఆఫీసు వర్గాలు మీడియాకు అనధికారికంగా తెలిపాయి. దీనిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం.

అలాగే ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణపైన ఆయన ఆరా తీశారు. విచారణ ఎంత వరకు వచ్చింది, ప్రాథమికంగా ఏం రిపోర్ట్ వచ్చిందని కేసీఆర్ అడిగారు. ముఖ్యమంత్రి రొటీన్ గా ఆగ్రహం వ్యక్తం చేస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందా? ఇప్పటికైనా మీడియా ముందుకు వచ్చి విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు న్యాయం జరుగుతుందని భరోసా ఇవ్వాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఈ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది.

తాజాగా షాబాద్ కు చెందిన ఒక్క విద్యార్థిని ఇంటర్ లో ఒక సుబ్జెక్టు ఫెయిల్ అయినందుకు గాను నిప్పంటించుకుని మరణించింది. దీనితో ఇప్పటివరకు తెలంగాణాలో ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల సంఖ్య 17కు చేరింది. కాగా ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ మంగళవారం నాడు ఇంటర్ బోర్డ్ లో దాదాపు ఐదు గంటల పాటు విచారణ సాగింది. మరోవైపు బోర్డు ఆఫీసు వద్ద తల్లితండ్రుల ఆందోళన, వారి అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి.