KCR relative ritesh Rao Arrestedఅదేంటి కేసీఆర్ ముద్దుల మనవడు అరెస్టు అవ్వడం ఏంటి అనుకుంటున్నారా? ఈ వార్త కేసీఆర్ అసలు మనవడి గురించి కాదు వరుసకు మనవడు అయ్యే మరొకరి గురించి. వివరాల్లోకి వెళ్తే… దాదాపు 37మంది ఎన్.ఎస్.యూ.ఐ కార్య‌క‌ర్త‌లు ప్ర‌గ‌తి భ‌వ‌న్ ను ముట్ట‌డించి, రాష్ట్రంలో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ వాయిదా వేయాల‌ని, క‌రోనా వైర‌స్ ఉధృతి స‌మ‌యంలో ప‌రీక్ష‌లు మంచిది కాద‌ని వారు ఆరోపించారు.

ఈ ముట్ట‌డిలో సీఎం కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు కొడుకు రితేష్ రావు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. పోలీసులు రితేష్ రావును ఏ5 గా కేసులో చేర్చారు. అరెస్ట్ చేసిన వారికి కోర్టు 14రోజుల రిమాండ్ వేయ‌టంతో అంద‌ర్నీ చంచ‌ల్ గూడ జైలుకు త‌ర‌లించారు. ఈ అరెస్ట్ పై సీఎం కేసీఆర్ అన్న కూతురు, కాంగ్రెస్ పార్టీ నేత‌ ర‌మ్యారావు మండిప‌డ్డారు.

ఆస్తుల కోస‌మో, క‌మిష‌న్ల కోస‌మో ఎన్.ఎస్.యూ.ఐ కార్య‌క‌ర్త‌లు అడ‌గ‌లేద‌ని… విద్యార్థుల ప్రాణాల‌ను కాపాడ‌ల‌న్న ఉద్దేశంతోనే వారు ఆందోళ‌న చేశార‌న్నారు. నిరసనలో పాల్గొన్న వారిని అరెస్టు చెయ్యడం.. కేసులు పెట్టడం అమానుషమని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ కు ఆయన కూతురైన రమ్యకు సరైన సంబంధాలు లేని విషయం తెలిసిందే.

రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరపున యాక్టీవ్ గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో అమరావతి వెళ్లి మరీ ఆయనకు మద్దతు తెలిపారు. పలు ఎన్నికలలో తెలంగాణలో టీడీపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు.