Danger Bells for KCR Even in A Victory?నాగార్జున‌సాగర్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల నగారా మోగింది. మార్చి 23 నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. మార్చి 30న నామినేషన్లకు చివరి రోజు కాగా మే 2న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడుతుంది అన్న తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికలు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్నాయి.

దుబ్బాక, జీహెచ్ఎంసిలో బీజేపీకి అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. అయితే ప్రస్తుతం కౌటింగ్ జరుగుతున్న రెండు భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు చోట్లా తెరాస అభ్యర్థులు గెలిచే అవకాశం ఉండటంతో తమకు అనుకూలిస్తుందని అధికారపక్షం భావిస్తుంది.

అయితే ఒక చోట బీజేపీ అభ్యర్ధికి ఇంకో చోట తెరాస పై చాలా కాలంగా పోరాడుతున్న తీన్మార్ మల్లన్న కు గణనీయమైన స్థాయిలో ఓట్లు రావడంతో అధికార పార్టీ రిలాక్స్ కావడం కుదరదు అని చాలా మంది అభిప్రాయం. ఈ తరుణంలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక కీలకం కాబోతుంది. ఈ ఎన్నికలో గనుక తెరాస సునాయాసంగా గెలిస్తే మాత్రం బీజేపీ ఎఫెక్ట్ కొంతమేర తగ్గించి చూపించుకోవచ్చు.

స్థానంలో గత సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా నోముల నర్సింహయ్య గెలిచారు. అనంతరం ఆయన అకాల మరణం చెందడంతో ఈ స్థానంలో ఉపఎన్నిక అనివార్యమైంది. నోముల సతీమణిని పోటీ చేయించే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈ స్థానంలో మరోసారి జానా రెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంటుంది. బీజేపీ అభ్యర్థి మీద ఇంకా క్లారిటీ లేదు.