Gutha Sukender Reddyమాజీ ఎంపీ, రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆయన పేరును ఎమ్మెల్యేల కోటాలో జరిగే శాసనమండలి ఎన్నికకు ఖరారు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ విషయం ప్రకటించగా, గుత్తా ఆయనను కలిసి కాసేపటి క్రితం న్యవాదాలు తెలిపారు. నల్లగొండ ఎంపీగా కాంగ్రెస్‌ నుంచి 2014 ఎన్నికల్లో విజయం సాధించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యం లో తెరాసలో చేరారు.

అయితే కేసీఆర్ అప్పట్లో ఆయనకు మంత్రి పదవి ఇస్తా అని హామీ ఇచ్చినా ఆది జరగలేదు. తొందరలో కేసీఆర్ తన క్యాబినెట్ ను విస్తరిస్తారని సమాచారం. అయితే అప్పుడు కూడా గుత్తా కు అవకాశం రాకపోవచ్చని, అయితే ఈ ఏడాది చివరిలో జరిగే క్యాబినెట్ విస్తరణలో మాత్రం ఆయనకు తప్పకుండా చోటు దక్కవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయం కేసీఆర్ తనను కలవడానికి వచ్చిన గుత్తా కు చెప్పారని ఆయన అనుచరులు నియోజకవర్గంలో చెబుతున్నారు.

దీనితో ప్రస్తుతానికి గుత్తాకు అర్ధ ఆనందమే… ఆగస్టు 6న తెలంగాణ మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశముంది. అత్యున్నత విశ్వస నీయవర్గాల సమాచారం ప్రకారం ఈ విస్తరణలో నలుగురు సీనియర్‌ నేతలకు చోటు లభించనుందని తెలిసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపుగా ఖరారైందని విశ్వసనీయ సమాచారం.