KCR Nithiin Social Distancing - Coronavirus-రెండు తెలుగు రాష్ట్రాల కరోనా నియంత్రణ చర్యలలో హీరో నితిన్ తన వంతు పాత్రను పోషించడానికి ముందుకు వచ్చారని మన పాఠకులకు తెలుసు. ఈ ప్రమాదకరమైన వైరస్‌తో పోరాడటానికి నితిన్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు ఒక్కొక్కరికి 10 లక్షలు విరాళంగా ప్రకటించారు.

నితిన్ ప్రగతి భవన్‌లో ఈ రోజు సిఎం కేసీఆర్ ను కలుసుకుని చెక్కును అందజేశారు. ఈ క్రమంలో నితిన్ దాతృత్వాన్ని మెచ్చుకుని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. సోషల్ డిస్టెంసింగ్ గురించి ప్రజలకు వివరించాల్సిన ముఖ్యమంత్రి ఈ సమయంలో అలా ఆలింగనం చెయ్యడం తప్పని కొందరు అంటున్నారు.

కొందరు ఇటువంటి సమయంలో అసలు నితిన్ బయటకు రాకుండా డబ్బులు అకౌంట్ ట్రాన్సఫర్ చెయ్యాల్సింది అంటున్నారు. రెండు విషయాలలోనూ నిజం ఉందనే చెప్పుకోవాలి. ఈరోజు మన ఉన్న పరిస్థితికి ఇటువంటి మంచి పనులను కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఏర్పడింది.

ఇది ఇలా ఉండగా తెలంగాణాలో ఈరోజు మూడు కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసులు 36కు చేరాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ఒక కొత్త కేసు నమోదు అయ్యింది. దీనితో మొత్తం కేసులు ఏడుకు చేరాయి. దేశవ్యాప్తంగా ఆ సంఖ్య 500కు అటూఇటుగా ఉన్నాయి.