తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోల్ కత్తా లోని పశ్చిమబెంగాల్ సచివాలయంకు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీతో ఆయన మూడో ప్రంట్ గురించి చర్చలు జరిపారు. ఈ సంధర్భంగా దేశంలో కాంగ్రెస్‌, భాజపాలకు ప్రత్యామ్నాయంగా బలమైన ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆవశ్యకత ఉందని, ఏర్పాటుకు తొలి అడుగు పడిందని కేసీఆర్‌, మమతాబెనర్జీ తెలిపారు.

అయితే కేసీఆర్ తన జాతీయ రాజకీయ అరంగేట్రం కోల్ కత్తా నుండి మొదలుపెట్టడానికి ఒక కారణం ఉందట. స్వతాహా వాస్తుకు అధికప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్ తన మొదటి అడుగు దేశానికి తూర్పు దిశగా ఉన్న కోల్ కత్తా నుండి వేశారు. కూటమికి నాయకత్వం సమస్య వస్తుంది అనే వాదనల గురించి కూడా కేసీఆర్ ఈ సంధర్భంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.

“కూటమి నాయకత్వం సమస్య కానే కాదు. రాజకీయాలు భిన్నమైన వ్యక్తులతో కలిసి పనిచేసే పరిస్థితులు కల్పిస్తాయి. వాటిని నేను విశ్వసిస్తాను. భావసారూప్యమున్న అన్ని పార్టీలను కలుపుకొని పోతాం. ఒక పార్టీ చెప్పినట్టే మిగతా పార్టీలు నడవాలనుకోవడం సరికాదు,” అని కేసీఆర్ ఈ సంధర్భంగా తెలిపారు.