KCR - Narendra Modi - YS Jaganబీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్కొ ద్ది రోజుల క్రితం ఇండియా టుడే కాంక్లేవ్ లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలని, బీజేపీ తొందరలోనే రాష్ట్రంలో ఎదిగి ఒక ప్రత్యామ్న్యాయ శక్తిగా ఎదుగుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ మాట చెప్పి నాలుగు రోజులు కూడా అవ్వకముందే మాట మార్చినట్టుగా కనిపిస్తుంది. తాజాగా ఆయన రానున్న ఎన్నికలలో ఎన్డీయే 38 ఎంపీ సీట్లు గెలుస్తాదని చెప్పారు. బీజేపీకి ఈరోజుకు ఈరోజు రెండు రాష్ట్రాలలో ఒక్క సీటు కూడా గెలిచే సీన్ లేదు.

అంటే ఎన్డీయే వర్గాలే కలవాలి. బీజేపీకి రెండు రాష్ట్రాలలోనూ మిత్రులెవరూ లేరు. ఏపీలో టీడీపీ, తెలంగాణాలో కాంగ్రెస్ తో కలిసే అవకాశం లేదు. అంటే ఇక మిగిలి ఉన్నది వైఎస్సాఆర్ కాంగ్రెస్, తెరాస మాత్రమే కదా? ఈ రెండు పార్టీలు ఎన్డీయేలోకి వస్తాయి అని కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే ఆ రెండు పార్టీలతో లోపాయకారి ఒప్పందాలు ఇప్పటికే జరిగాయి అనుకోవాలి. బీజేపీ ఏపీని మోసం చేసింది అని చెబుతున్న జగన్, విప్లవాత్మక మార్పు కోసం ఫెడరల్ ఫ్రంట్ అని చెబుతున్న కేసీఆర్ అబద్దం ఆడుతున్నట్టా?

ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు ఉన్నఫళంగా వేడెక్కాయి. డిపాజిట్లు దక్కే సీట్లు 4-5 కూడా చెప్పడం కష్టంగా ఉన్న బీజేపీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సాగుతుండడం విశేషం. తెలంగాణాలో మాత్రం ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలలో తెరాస ఘనవిజయం సాధించడంతో అక్కడి ప్రతిపక్షం ప్రస్తుతానికి చాలా నిస్తేజంగా ఉంది. ఈ నెల 8వ తారీఖున సార్వత్రిక ఎన్నికలకు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.