KCR - Narendra Modi  Vote on account budgetఈనెల 31వతేదీ నుంచి ఫిబ్రవరి 13వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి.ప్రస్తుత ప్రభుత్వానికి ఇవే చివరి పార్లమెంటు సమావేశాలు కానున్నాయి. ఈ సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సహజంగా ఏదైనా ప్రభుత్వం ఎన్నికల సంవత్సరం లో ప్రవేశ పెట్టే బడ్జెట్ ను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గా ప్రవేశపెడుతుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది టెంపరరీ బడ్జెట్ ఎన్నికల వరకే ప్రణాళిక రచించి దానికే బడ్జెట్ వేస్తారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఆ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది.

దీని వల్ల కొత్త ప్రభుత్వానికి తన విధానాల బట్టి బడ్జెట్ రూపొందించుకునే అవకాశం వస్తుంది. అయితే ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గా కాకుండా పూర్తి స్థాయి బడ్జెట్ గా ప్రవేశపెట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తోంది అని సమాచారం. ఎలాగూ తిరిగి అధికారంలోకి వచ్చేది తామే అంటూ కాన్ఫిడెన్స్ చూపించుకోవాలని బీజేపీ ఉద్దేశంగా ఉండవచ్చు. అయితే దీనిని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మోడీ ప్రభుత్వం వరుస ఈ రకంగా ఉండగా తెలంగాణలో కేసీఆర్ వ్యవహార శైలి ఇంకో విధంగా ఉంది.

ఇటీవలే తిరిగి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం మాములుగా అయితే పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలి. అయితే కేంద్రంలో ప్రభుత్వం మారుతుంది కాబట్టి మేము కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతాం అంటున్నారు కేసిఆర్. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. పూర్తి స్థాయి బడ్జెట్ కేంద్రంలో వచ్చే కొత్త ప్రభుత్వం విధానాల బట్టి సార్వత్రిక ఎన్నికల తరువాత తయారు చేసుకుంటాం అని అంటున్నారు. ఇప్పుడు కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే కేసిఆర్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారేమో చూడాలి. మోడీ తీరు అలా ఉంటే కేసిఆర్ తీరు ఇలా ఉంది మరి. కాన్సర్ ట్రీట్మెంట్ కోసం అరుణ్ జైట్లీ అమెరికాలో ఉండడంతో ఆర్ధిక మంత్రి లేకుండానే బడ్జెట్ తయారు అవుతుంది. మరోవైపు తెలంగాణ లో ఆర్ధిక మంత్రే లేరు.