KCR-Calls-For-Emergency-Cabinet-Meet-to-Discuss-Snap-Pollsవచ్చే ఎన్నికల వ్యూహరచన గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎంపీలు, మంత్రులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పొత్తుల విషయం ప్రస్తావనకు వచ్చిందట. తెలంగాణలో పొత్తులు ఉంటాయని అక్కడి నాయకులు, కేడర్‌తో చర్చించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుందామని వ్యాఖ్యానించారు.

“తెరాస రాజకీయంగా బీజేపీకి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ నిర్ణయాలు.. రాజకీయ సంబంధాలు అదే కోణాన్ని సూచిస్తున్నాయి. తెరాస బీజేపీకి దగ్గరైతే.. ఆ పార్టీకి టీడీపీ దూరంగా ఉండక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది’’ అని నాయకులు అభిప్రాయపడ్డారు. “‘తెరాసతో అధికారికంగా పొత్తు ఉండాలని బీజేపీ కోరుకుంటోంది. అలా పొత్తు పెట్టుకొంటే తెరాస మునిగి పోతుంది,” బాబు అన్నారట.

ఇదే సందర్భంగా కాంగ్రెస్ తో పొత్తు గురించి కూడా చంద్రబాబు స్పందించలేదు. తెలంగాణలో తెదేపాతో పొత్తుపై కాంగ్రెస్‌ నాయకులే మాట్లాడుతున్నారని ఎంపీ గరికపాటి మోహనరావు పేర్కొనగా… అలా మనమెప్పుడూ చెప్పలేదు కదా అని చంద్రబాబు అన్నారు. తెలంగాణాలో నవంబర్ లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది.