kcr-mothukapalli-narasimhulu-bondingమాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెరాస కండువా కప్పుకున్నారు. దళితులు ఎక్కువగా ఉండే హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపే టార్గెట్ గా కేసీఆర్ చెయ్యని ప్రయత్నమంటూ లేదు. దళితబందు ఇచ్చిన దగ్గర నుండి దళిత నాయకులందరూ మా బంధువులే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్.

అందులో భాగంగా తనను గతంలో బండ బూతులు తిట్టిన మోత్కుపల్లిని కూడా కలిపేసుకున్నారు. మోత్కుపల్లిపై ప్రశంసలు కురిపించారు. మోత్కుపల్లికి రాజకీయ అనుభవం ఎంతో ఉందని కొనియాడారు. మోత్కుపల్లి తనతో కలిసి ఎన్నో ఏళ్లు పనిచేశానని.. మా ఇద్దరిదీ విలక్షణమైన స్నేహమని చెప్పుకొచ్చారు.

అలాగే మోత్కుపల్లి అణగారిన వర్గాల గళం వినిపించారని తెలిపారు. గతంలో విద్యుత్ కోసం ఎన్నో కష్టాలు పడ్డామని, విద్యుత్ మంత్రిగా చేసిన మోత్కుపల్లికి ఆ కష్టాలు తెలుసని చెప్పారు. కేసీఆర్ ని ఎక్కువగా తిట్టే నేతలు అంటే సహజంగా ఇప్పుడు గుర్తొచ్చేది రేవంత్ రెడ్డి. అయితే ఒకప్పుడు మోత్కుపల్లి కేసీఆర్ ని అన్న మాటలు రేవంత్ అన్న మాటలకు ఎన్నో రేట్లు అని చెప్పుకోవాలి.

దళిత నేత కావడంతో తిరిగి తిట్టలేకపోవడంతో మోత్కుపల్లి చెలరేగిపోయారు. ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికల కోసం స్నేహితులు అయిపోయారు. అయితే తెరాస శ్రేణులకు మాత్రం ఇది ఇబ్బందిగానే ఉంది. అయితే వ్రతం చెడ్డా కనీసం ఫలితం దక్కితే చాలు అనుకుంటున్నారు వారు. ఇక్కడ ఫలితమంటే హుజురాబాద్.