KCR - Lagadapati Rajagopalఎన్నికలకు మూడు రోజుల ముందు.. డిసెంబర్ 4 మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమితికి ఏమీ కలిసిరాని రోజు బహుశా. అయితే దానికి కేసీఆర్ తనని తాను నిందించుకోవాల్సిందే. ఈరోజు తెల్లవారు జాము పోలీసులు కొడంగల్ లోని రేవంత్ రెడ్డి ఇంటి తలుపులు బద్దలుకొట్టి ఆయనను అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోసిగి సభను అడ్డుకోవడానికి రేవంత్ పిలుపునిచ్చారు అనేది అభియోగం. అయితే ఇదో సెల్ఫ్ గోల్ లా పరిణమించి కేసీఆర్ కు ఉపయోగపడొచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

అందుకు తగ్గట్టే హైద్రాబాద్ హై కొర్టు పోలీసులకు, ఎన్నికల కమిషన్ కు మొట్టికాయలు వేసింది. బంద్‌కు రేవంత్‌ పిలుపునిస్తే తప్పేంటని.. ఆయనను అదుపులోకి తీసుకొని ఏ నేరాన్ని నియంత్రించారని పోలీసులను ప్రశ్నించింది. కోర్టు నుండి వ్యతిరేక తీర్పు రాబోతుందని గ్రహించి వెంటనే ఆయనను విడుదల చెయ్యాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో ఉన్న కేసీఆర్ పై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అల్లంపూర్ సభలో కేసీఆర్ సొంత కార్యకర్తల మీద విరుచుకుపడ్డారు.

గొడవ చేస్తున్నారంటూ బేవకూఫ్ గాళ్లు… పిచ్చొళ్ళు… బుద్ధి లేదా అంటూ వారిపై ఉరిమారు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఈరోజు సాయంత్రం లగడపాటి రాజగోపాల్ తన సర్వే విజయవాడలో విడుదల చేయబోతున్నారని వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. “ఈరోజు సాయంత్రమ్ ..మనకి వ్యతిరేఖంగా ఒక లంగ గాడి సర్వే వస్తది .. దాన్ని నమ్మకండి,” అంటూ పిలుపునిచ్చారు ఆయన. దీనితో ఆ సర్వే తెరాసకు వ్యతిరేకంగా ఉందని కేసీఆర్ చెప్పకనే చెప్పారు.