KCR- L Ramana-Huzurabadతెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీకి గుడ్ బై చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరిపోయారు. బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్ పార్టీని వదిలి వెళ్లడంతో అదే బీసీ నేత ఎల్ రమణ తో ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేశారు.

అయితే పార్టీలో చేరే క్రమంలో రమణ కు బంపర్ ఆఫర్ ఇచ్చారట కెసీఆర్. హుజురాబాద్ లో ఈటల రాజీనామా కారణం గా జరిగే ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా రమణ ఖాయం ఐపోయారట. ఒకవేళ ఈటల పై గెలిస్తే ఆయనకు మంత్రిపదవి ఖాయమట.

ఒకవేళ ఆయన ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి ఇస్తా అని కేసీఆర్ హామీ ఇచ్చారట. 2009 తరువాత రమణ శాసనసభకు ఎన్నిక కాలేదు. మరోవైపు… ఈటల హుజురాబాద్ లో 2009 నుండి వరుసగా నాలుగు ఎన్నికలలో గెలిచి నియోజకవర్గం మీద బాగా పట్టుసాధించారు.

ఆయనకు రమణ ఏ మేరకు పోటీ ఇస్తారో చూడాలి. హుజురాబాద్ ఎన్నికలలో గెలిచి తనకు తెలంగాణ లో ఏ మాత్రం చరిష్మా తగ్గలేదు అని కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. అదే విధంగా ఈ ఉపఎన్నికలో ఓడించి తనను ధిక్కరించిన ఈటల రాజకీయ జీవితాన్ని ఖతం చెయ్యాలని బలంగా అనుకుంటున్నారు.