Telangana-High-Court-To-Order-Revaluation-of-All-Failed-Students2014లో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన నాటి నుండీ కేసీఆర్ కు పెద్దగా ఇబ్బంది పెట్టిన సమస్యలు ఏమీ లేవు అనే చెప్పాలి. 10 కిలోమీటర్ల లోతున పాతరేస్తా అంటూ మీడియాకు వార్నింగ్ ఇచ్చి చేసి చూపించారు కేసీఆర్. అలాగే ఆపరేషన్ ఆకర్షతో తెలంగాణాలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేశారు. ప్రతిపక్షంలో కేసీఆర్ కు తొలినాళ్ళలో కొరకరాని కొయ్యగా మారిన రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు ట్రాప్ విసిరి అడ్డుతొలగించుకున్నారు. దీనితో ఆయనను ఎదిరించే గొంతు లేకుండా పోయింది.

దీనితో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకు సోషల్ మీడియాలో మంచి పట్టు దొరికింది. అయితే అనుకోకుండా పడిన పిడుగులా ఇంటర్ గొడవ ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. కేసీఆర్ ఎప్పటిలానే ఇవేమీ పట్టనట్టు ఫార్మ్ హౌస్ లో ఉండిపోయారు. సహజంగా ఏ సమస్యనైన ఒక్క ట్వీట్ లో సరిజేస్తా అని చెప్పుకునే కేటీఆర్ ఫిరాయింపుల పనిలో బిజీగా ఉండిపోయారు. సదరు మంత్రి జగదీష్ రెడ్డి మీడియా ముందుకు వస్తే ప్రభుత్వానికి కొత్త తలపోటు తెచ్చేలా ఉన్నారు. ఆయన మీడియా ముందు ఇస్తున్న స్టేట్ మెంట్లు పేరెంట్స్ కు మరింత బీపీ తెస్తుంది.

హై కోర్టు కూడా ఇప్పటికే ఈ విషయంలో మొట్టికాయలు వేసింది. ఈ క్రమంలో తెరాస సోషల్ మీడియా అభిమానులకు ఈ పరిస్థితి మింగుడు పడటం లేదు. ఎప్పుడు ఆఫెన్స్ లో ఉండే వారు డిఫెన్స్ కు కొత్త అయిపోయి బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఉద్యమం రాజకీయ నాయకులు కాకుండా సామాన్య ప్రజలు నడుపుతుండడంతో ప్రతిపక్షాల కుట్ర యాంగిల్ కూడా లేకుండా పోయింది. దీనితో వారు కేసీఆర్ బయటకు వచ్చి ఎలాగోలా పరిస్థితిని చక్కదిద్దుతారని ఆశగా వేచి చూస్తున్నారు. మరి కేసీఆర్ ఎప్పుడు కరుణిస్తారా.