KCR - KTRఆంధ్రోళ్ల అనే మాటను తిట్టుగా మార్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్రోళ్లు అనే ఒక్క మాట తో ఒక ఉద్యమాన్నే నడిపి రాష్ట్రం సాధించుకున్నారు కేసీఆర్. ఈ ప్రయత్నంలో ఆయన ఆంధ్ర వారిని అనని మాట లేదు, తిట్టని తిట్టూ లేదు. అయితే అధికారంలోకి వచ్చాక సెట్లర్లను హైదరాబాద్ నుండి బయటకు పంపడం అసంభవమని ఆయన గ్రహించారు. పైగా దాదాపుగా ముప్పయి సీట్లలో వారు ప్రభావం చూపించగలిగే స్థితిలో ఉండటంతో కొంత తగ్గి కలుపుకుని పోవడం మొదలు పెట్టారు.

అయితే 2018 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు మళ్ళీ తెలంగాణ రాజకీయాలలోకి రావడాన్ని చూసి ఆంధ్రోళ్ల పాలన మనకు కావాలా అంటూ సెంటిమెంట్ పండించారు కేసీఆర్. ఆ ఎన్నికలలో విజయఢంకా మోగించారు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ను ఆంధ్ర నాయకులు అందుకున్నారు. జగన్ ని గెలిపిస్తే కేసీఆర్ పాలనను నెత్తిన పెట్టుకున్నట్టే అని ఎన్నికల సభలలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రజలను రెచ్చగొడుతున్నారు. దీనితో తెలంగాణ వైపు వారు ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు.

అదేంటి ఇటువంటి రాజకీయాలు మీరెలా చేస్తారు? చేస్తే గీస్తే మేమే చెయ్యాలి అన్నట్టు మాట్లాడుతున్నారు.తెలంగాణ మంత్రిని ఆంధ్రకు పంపి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు ఈ నీతులు ఏమయ్యాయి? నిన్నదాకా ఆంధ్ర రాజకీయాలలో వేలు పెడతాం అని చెప్పి ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలతో మాకేం సంబంధం? మమ్మల్ని ఎందుకు దీంట్లో లాగుతున్నారు? అంటూ వాపోతున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని తిడితే ఎక్కడ ఆ పార్టీలకు ఎన్నికలలో మేలు కలుగుతుందో అనే గానీ లేకపోతే బూతు పురాణం విప్పే వారే కదా? ఏప్రిల్ 11 వరకు ఈ బాధను పంటి బిగువున అదిమి పట్టుకోవాల్సిందే.