KCR -Jagan కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త విద్యుత్ చట్టం పై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. అప్పులు ఎక్కువ తీసుకునే అవకాశం ఉండటంతో కేంద్రం పెట్టిన షరతులు ఒప్పుకుంది జగన్ ప్రభుత్వం. స్వర్గీయ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా తెచ్చిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పథకాన్ని రిస్కులో పెట్టారు జగన్.

కేంద్రం ఆదేశాల మేరకు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధం అవుతుంది. అయితే దీనివల్ల ఎటువంటి నష్టం ఉండదని ప్రభుత్వం నగదు బదిలీ కింద బిల్లులని మాఫీ చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. అయితే ఇదే విషయం మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో మరో రకంగా స్పందించారు.

“రాష్ట్రంలో 26 లక్షల కరెంట్‌ మోటార్లు ఉన్నాయి. వీటికి విద్యుత్తు సరఫరా కోసం ఏడాదికి 10 వేల కోట్లు ఇస్తున్నాం. కొత్త చట్టం అమల్లోకి వస్తే, ఈ పంపులకు మీటర్లు పెట్టాలి. రీడింగ్ తీస్తారు.రైతుల ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తారు. అప్పుడు రాష్ట్రాల చేతిలో ఏమీ ఉండదు,” అంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు.

ఒకే విషయంపై ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నమైన అభిప్రాయాలు చెబుతున్నారు. ఇందులో ఎవరిది నిజం? ఎవరిది అబద్దం? కేవలం అప్పుల కోసం రైతులను రిస్కులో పడేస్తున్నారా? వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు వంటి ప్రతిష్టాత్మక పథకం చరిత్రలో కలిసిపోనుందా?