KCR ignored andhra leaders  for WTC 2017గత కొంత కాలంగా తెలంగాణాలో వచ్ఛే ఎన్నికలలో వెల్-కమ్ జరగబోతుంది అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలలో రెండు బలమైన కులాలు – వెలమ, కమ్మ ఎన్నికల వేళ కలిపేందుకు కేసీఆర్, చంద్రబాబు పొత్తు ప్రయత్నాలు చేస్తున్నారని ఆ వార్తల సారాంశం. సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను తెలుగు దేశం ద్వారా వచ్చే ఓట్లతో భర్తీ చేసే ప్రయత్నం ఈ వెల్-కమ్.

అనుకోకుండా మొన్న కేటీఆర్ సైబరాబాద్ సృష్టికత్త చంద్రబాబే అని ఒప్పుకోవడంతో ఈ పుకార్లకు మరింత ఊతం ఇచ్చినట్టు అయ్యింది. మరోవైపు చంద్రబాబు గానీ, కేసీఆర్ గానీ దీనిపై స్పందించకపోవడం, దీనిని వంక పెట్టి రేవంత్ రెడ్డి లాంటివారు పార్టీ మారిన చంద్రబాబు ఆపకపోవడంతో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి.

కాకపోతే ఇవన్నీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ ఎప్పటిలానే తెలుగు దేశంని దూరం పెట్టారు. హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలలో కనీసం తారకరామారావు పేరు కానీ ఫోటో గాని పెట్టకపోవడం, పొరుగు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని కనీసం పిలవకపోవడంతో వెల్-కమ్ అనేది మీడియా సృష్టేనా? అనే అనుమానం కలుగుతుంది. నిజంగా వెల్-కమ్ ప్రతిపాదన ఉంటే ఈ పాటికే దానికి ప్రజామోదం వచ్చేలా ఇద్దరు చంద్రులు చెట్టాపట్టలేసుకుని తిరిగే వారు. కేటీఆర్ చంద్రబాబుని పొగిడిన సందర్భంలో కూడా ఆయన మొహం చూస్తే తప్పక చెప్పినట్టే కనిపిస్తుంది. దీనిబట్టి ప్రస్తుతానికి ఇద్దరు చంద్రుల కలయిక లేదనే అనుకోవాలి.