KCR helps YS Jagan to appoint Stephen Raveendra in andhra pradeshఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా స్టీఫెన్‌ రవీంద్ర గా నియమించే అవకాశం ఉన్నట్టు ఉంది. ప్రస్తుతం స్టీఫెన్‌ రవీంద్ర హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీగా పని చేస్తున్నారు. గతంలో రాయలసీమ ఐజీగా విధులు నిర్వర్తించారు. ఇప్పుడు ఆయన తెలంగాణ క్యాడర్ లో ఉన్న ఆయన కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలి. అలాగే ఆయనను రిలీవ్ చెయ్యడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం రాయాలి. అప్పుడు కేంద్రం దానిని పరిశీలిస్తుంది.

జగన్ కు మోడీకి, కేసీఆర్ కు ఉన్న సత్సంబంధాల వల్ల అది తేలికగానే జరుగుతుందని అనుకుంటున్నారు. విభజన అనంతరం కారణాలు ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్లు చాలా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫోన్ టాపింగ్ చేసిన పసిగట్టలేకపోయారు. రైలు తగలుబెట్టినా ఏమీ చెయ్యలేకపోయారు. దీనితో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ ను బలోపేతం చెయ్యడం పై జగన్ మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. 2014 ఎన్నికల తరువాత కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చంద్రబాబు ప్రయత్నించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ ను బలోపేతం చెయ్యడం ద్వారా అటువంటి ఇబ్బందులేమీ కొత్త మిత్రుడు జగన్ మోహన్ రెడ్డి కు రాకుండా కేసీఆరే ఈ సలహా ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే చంద్రబాబు చే నియమింపబడ్డ అందరు అధికారులను జగన్ మార్చే పనిలో ఉన్నారు. ప్రస్తుత డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ను తప్పించి ఆయన స్థానంలో గౌతమ్‌ సవాంగ్‌ను నియమించనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు.