KCR health policy privatisation of government hospitalsపేదవాడికి జబ్బు చేస్తే.. కార్పోరేట్ దవాఖానాలకు వెళ్ళలేడు. కష్టమో నష్టమో అనుకొని సర్కార్ దవాఖానాకు మాత్రమే వెళ్తాడు. ఇందుకు కారణం లేకపోలేదు. సర్కార్ దవాఖానాలో అయితే, ఖర్చు ఉండదు. ఎలాగోలా వైద్యం చేస్తారు.. ఇది మన దేశంలోని ప్రతి పేదవాడి గుండెల్లోని మాట.

అయితే, ఇప్పుడు ఆ సర్కారీ వైద్యం కూడా తెలంగాణాలో పేదవాడికి అందకుండా పోయే రోజులు రాబోతున్నాయి. సర్కారీ వైద్యాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు తెలంగాణ సర్కారు పావులు కదుపుతోంది. ఇప్పటికే ఈ-వైద్య అనే సంస్థకు నాలుగు ప్రాధమిక వైద్య ఆరోగ్య కేంద్రాల బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నాలుగు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఆ సంస్థ యొక్క పని తీరును చూసిన తరువాత మిగతా వాటిని కూడా అప్పగిస్తారు.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 685 ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు, 177 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటినిని కూడా త్వరలోనే ఆ సంస్థకు కట్టబెట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. సర్కారీ ధవాఖానాలలో ఫీజు ఉండదు, మందులు కూడా ఉచితంగానే పంపిణి చేస్తారు. పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు జాతీయ ఆరోగ్య కేంద్రం నుంచి నిధులు వస్తాయి.

కానీ, కేసీఆర్ సర్కారు తీసుకునే నిర్ణయంతో ఈ నిధులు డైరెక్ట్ గా ఆ సంస్థకే వెళ్తాయట. డాక్టర్స్ ను నియమించుకోవడం నుంచి ఆయా కేంద్రాలలో మౌళిక వసతులను ఏర్పాటు చేసుకోవడం వరకు అన్నీ ఆ సంస్థ చేతుల్లోనే ఉంటుంది. అయితే, ఫీజు వసూలు చేయబోమని ప్రభుత్వం చెప్తుంటే.. ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోవని.. సకాలంలో నిధులు రాకపోతే.. వాటి నిర్వహణ కష్టం అవుతుందని ప్రైవేట్ సంస్థ చెప్తోంది.