Revanth -Reddyదెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జైలు నుండి విడుదల కాకుండా జగన్ ప్రభుత్వం ఒక పథకం వేసింది. ఆయన జైలులో ఉండగా ఆయన మీద ఉన్న కేసులను తిరగదోడి ఆయనకు బెయిలు రాకుండా చేసే వారు. ఒక కేసులో బెయిలు రాగానే పిటి వారంట్ తీసుకుని విచారణ నిమిత్తం మరో కేసులో మళ్లీ అదుపులోకి తీసుకునేవారు.

అలా రెండు నెలలకు పైగా చింతమనేనిని జైలులో పెట్టింది ప్రభుత్వం. ఇప్పుడు అదే ఫార్ములాని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పై ప్రయోగిస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. కేటీఆర్ ఫార్మ్ హౌస్ పై అనధికారికంగా డ్రోన్ ప్రయోగించారు అనే కేసులో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన ప్రభుత్వం ఆయనను వీలైనంత కాలం జైలులో పెట్టే ప్రయతనం చేస్తున్నారు.

ఆయనపై ఉన్న ఇతర కేసుల నిమిత్తం పోలీసులు పిటి వారంట్ తీసుకుని విచారణ నిమిత్తం మళ్లీ అదుపులోకి తీసుకోవచ్చని కధనాలు వచ్చాయి. ఆయనపై ఉన్న అరవై మూడు కేసులలో ఏ ఒక్క కేసులో అయినా రెండేళ్ల శిక్షపడితే ఎమ్.పి పదవి పోయే అవకాశం ఉంటుందని ఆయన ప్రత్యర్దులు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం టార్గెట్ కూడా అదే.

మరోవైపు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్న టీవీ9 ఛానల్ రేవంత్ పై పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం చేస్తుంది. జూబ్లిహిల్స్ హౌజింగ్‌ సొసైటీలో ఫోర్జరీ చీటింగ్‌ కేసులు, ట్రెస్‌పాస్‌, వివిధ ప్రాంతాల్లో భూకబ్జాలకు సంబంధిన కేసులు రేవంత్‌పై ఉన్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 7 కేసులు, ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘనపై మరో కేసు, కొడంగల్‌లో 9, సైఫాబాద్ 10, గచ్చిబౌలి 4, జూబ్లిహిల్స్‌3, బంజారాహిల్స్‌ 3, అబిడ్స్ 3, సుల్తాన్‌ బజార్‌ 3, మద్దూర్ 3, పంజాగుట్ట 3, ఓయు పోలీస్‌ స్టేషన్‌లో మరో కేసు రేవంత్‌పై నమోదై విచారణ దశలో ఉన్నాయి.