KCR goes against andhra pradesh no confidence motionఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి మాట మార్చింది. విభజన చట్టంలో ఉన్న వాటికే మద్దతు ఇస్తామని..ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమ పరిశ్రమలు ఏపీకి వెళ్లవా? లోక్ సభలో టీఆర్ఎస్ ఉపనేత జి. వినోద్ అన్నారు. అయితే గతంలో ముఖ్యమంత్రి, ఆయన తనయ కవిత ప్రత్యేక హోదాకు మద్దత్తు తెలిపిన సంగతి తెలిసిందే.

పైగా కేంద్రంతో గొడవ పెట్టుకుంటే రాష్ట్రానికి వచ్చే నిధులు ఆగిపోతాయంటూ ఆ పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. అంతే కాదు..మోడీతో కలసి సాగేందుకే సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు పంపుతోంది టీఆర్ఎస్. తోటి తెలుగు వాడికి జరుగుతున్న అన్యాయం పై మౌనం గా ఉండటం తెరాసకు తగదు.

కేంద్రం మొత్తం గా తెలుగు వారికి అన్యాయం చేస్తున్నది అని గుర్తించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీజేపీకి అంటరాని రాష్ట్రమైంది, రేపు అదే స్థానంలో తెలంగాణ ఉండవచ్చు. ఇప్పుడు ఆంధ్రకు కలిసి రాకపోతే అప్పుడు తెలంగాణకు ఎవరు మద్దత్తు ఇవ్వరు. అన్నదమ్ములుగా విడిపోయినా కలిసి ఉందాం అని కేసీఆర్ చెప్పిన మాటలకు విలువ లేకుండాపోతుంది.

తెలంగాణలోని ఆంధ్రులు దీనిని ద్రోహంగా పరిగణించవచ్చు. అవిశ్వాస తీర్మానాన్ని పై చర్చ సందర్భంగా గా కేంద్రం ఏమన్నా ఇన్సంటివ్ లు ఇస్తే అడ్డుకుంటాం అని ఎంపీ వినోద్ ప్రకటించడం సిగ్గు చేటు. రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరికొకరు సహకరించుకోకపోతే వాటి మనుగడకే ప్రమాదం. రెండు రాష్ట్రాలను భౌగోళికంగా విడదీశాక ఇప్పుడు మానసికంగా విడదీస్తున్న అపప్రధ కూడా తెరాస మూటగట్టుకుంటుంది.