KCR gifts Kumari Lakshmi Srija Rs 10,16,000 for Higher Studiesఖమ్మం జిల్లాకు చెందిన కిరణ్ కుమార్, సుధారాణి దంపతుల గారాలబిడ్డ లక్ష్మీ శ్రీజ ప్రతిభను చూసి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అబ్బూరపడ్డారు. మూడవ తరగతి చదువుతున్న ఈ చిన్నారి లక్ష్మీ శ్రీజ, కాకతీయుల పాలన నుండి తెలంగాణ ఉద్యమం వరకూ, ముఖ్యమంత్రుల, మంత్రుల పేర్ల నుంచి కరంట్ ఎఫైర్స్ వరకూ అనర్గళంగా చెబుతుంటే స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చూసి ముగ్ధుడయ్యారు.

దీంతో తన సొంత ఖాతా నుండి అప్పటికప్పుడు 10 లక్షల 16 రూపాయల చెక్కు రాసిచ్చి, వారిని విందుకు ఆహ్వానించగా, శ్రీజ కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ భోజనం చేశారు. అంతేకాదు, వీలు చూసుకుని శ్రీజ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పి బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు. చిన్నతనం నుండి శ్రీజకున్న అపార జ్ఞాపక శక్తిని గమనించిన పాప తల్లిదండ్రులు సమకాలీన అంశాలపై అవగాహన కల్పిస్తూ వచ్చారు. ఈ పాప మేధస్సు గురించి ఇప్పటికే పలు పత్రికలు ప్రశంసించాయి.