Jagan_KCRముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఎన్నికల వాగ్ధానాలలో వచ్చే ఎన్నికల నాటికి సంపూర్ణ మద్య నిషేధం ఒకటి. ఇందులో భాగంగా మొదటి విడతలో మద్యం షాపులను పూర్తిగా ప్రభుత్వం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల షాపుల వారికి ఇచ్చే కమిషన్ కూడా మిగులుతుంది.

మద్య నిషేధం మీద కేసీఆర్ కు ఇంట్రస్ట్ లేకపోయినా ఆదాయం పెంచుకోవడానికి . ఇదే మార్గంలో వెళితే ఎలా ఉంటందన్నద దానిపై తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం మొదలు పుట్టిందట. ప్రభుత్వ అధీనంలో షాపులను నడిపితే లాభాలు ఏ మేరకు ఉంటాయి? ఇబ్బందులేమిటి? ఎంతమంది సిబ్బంది అవసరం? కొత్తగా నియామకాలు ఏమైనా చేపట్టాలా? వంటి అంశాలను అధ్యయనం చేయాలని సూచించింది.

పూర్తి వివరాలతో ఒక నివేదిక ఇవ్వాలని కోరింది.
ఈ మేరకు దీనిపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ కూడా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వమే నడిపితే వచ్చే లాభనష్టాలపై అధ్యయనం మొదలైంది. ప్రజాభిప్రాయం కూడా సేకరిస్తున్నారు. అందువల్లే ప్రస్తుతానికి నెల రోజుల పాటు అదనంగా లైసెన్సులు ప్రస్తుత షాపులకు పొడిగించారని భావిస్తున్నారు.

అలాగే దీనివల్ల బెల్టు షాపులు తగ్గి ప్రభుత్వ ఆదాయం కూడా కోల్పోదు అనుకుంటున్నారు. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించే విధానం తమిళనాడు రాష్ట్రంలో ఎప్పటి నుంచో అమలులో ఉంది. అయితే తొలినాళ్ళలో షాపు అద్దెలు, సిబ్బంది నియామకాల వల్ల ప్రభుత్వం పై కొంత భారం ఉంటుంది. రాష్ట్ర ఆదాయం పెంచే క్రమంలో ఈ పద్ధతిని స్టడీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం.