KCR fires on BJP cenral Governmentతెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ఎదురుదాడికి దిగారు. ఎల్లుండే అధికారంలోకి వచ్చేలా బీజేపీ హడావిడి చేస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్రం పని తీరు సరిగా లేదని ఆయన అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిదులు కూడా సకాలంలో ఇవ్వడం లేదని ఆయన అన్నారు. దాంతో రాష్ట్రాలు జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడ్డాయని ఆయన అన్నారు.

బీజేపీ పాలన కన్నా తమ పాలన చాలా మెరుగైనదని ఆయన అన్నారు. కేంద్రంలోని ఆయుష్మాన్ భవ కన్నా ఆరోగ్యశ్రీ మంచిదని, కేంద్రంలో ఉన్న రైతు సమ్మాన్ కన్నా, తమ రైతు భందు ఉపయోగకరమని ఆయన అన్నారు. అవసరమైన చోట కాంగ్రెస్ ,బిజెపిలు కుమ్మక్కు అవుతున్నాయని కేసీఆర్ ఆరోపించడం విశేషం.

ఈ రెండు పార్టీలు దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లడం లో విఫలం అయ్యాయని అన్నారు. రెండు పార్టీలు పెత్తందారి విధానం అనుసరిస్తున్నాయని ఆయన అన్నారు. ఫిరాయింపుల విషయంలో తమను విమర్శిస్తున్న వారి మీద కూడా కేసీఆర్ విరుచుకుపడ్డారు. బీజేపీ వారు టిడిపి ఎంపీలను రాజ్యసభలో విలీనం చేసుకుంటే తప్పు లేదా?

తమ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విలీనం అయితే మాత్రం తప్పా అని ఆయన ప్రశ్నించారు. గోవాలో పది మంది ఎమ్మెల్యేలను బిజెపి తన పార్టీలో చేర్చుకుందని ఆన అయన అన్నారు. రాజస్థాన్ లో బిఎస్పి ఎమ్మెల్యేలు ఆరుగురిని కాంగ్రెస్ ఎలా విలీనం చేసుకుందని ఆయన అన్నారు. అంటే రాష్ట్రానికి ఒక రాజ్యాంగం ఉంటుందా అని ఆయన అన్నారు. అసెంబ్లీలో కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్న బీజేపీ గురించి ముఖ్యమంత్రి ఇంత ప్రముఖంగా ప్రస్తావించడం రాష్ట్రంలో మారుతున్న సమీకరణలకు అద్దం పడుతుందా?