KCR-fires-on-Amit-Shahతప్పుడు లెక్కలతో తెలంగాణా ప్రజలను మభ్య పెడితే ఊరుకునేది లేదని తెగేసి చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పిన అంకెల గారడీని నిరూపించగలిగితే… తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను… అంటూ కేసీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణా రాష్ట్రాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని, కేంద్రం లక్ష కోట్ల రూపాయల నిధులను ఇచ్చిందని అమిత్ షా వ్యాఖ్యానించగా, దానికి ప్రతిగా స్పందిస్తూ కేసీఆర్ ఆ సవాల్ విసిరారు.

అయితే ఈ సవాల్ కు స్పందించిన బిజెపి, కేసీఆర్ చేసిన సవాల్ కు కట్టుబడి ఉండాలని, అమిత్ షా చెప్పిన మాటలు నిజమని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని బిజెపి నేత లక్ష్మణ్ అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి తెలంగాణాకు విడుదల చేసిన అన్ని పత్రాలతో బిజెపి సిద్ధంగా ఉందంటూ, సదరు ఆధారాలతో కూడిన వివరాలను మీడియా ముఖంగా చూపించారు లక్ష్మణ్. ఈ సందర్భంగా మాట మీద నిలబడి కేసీఆర్ రాజీనామాను చేయాలని డిమాండ్ చేసారు.

అయితే రాజకీయాలలో ఈ సవాళ్ళు – ప్రతిసవాళ్ళు సర్వసాధారణం అన్న విషయం రాజకీయ విజ్ఞులకు తెలిసిందే. కేంద్రంపై ఆధిపత్యం ప్రదర్శించే క్రమంలో కేసీఆర్ సవాల్ విసరడం, అలాగే రాష్ట్రాలపై పైచేయి సాధించడానికి కేంద్రం ప్రయత్నించడం… ఇవన్నీ రొటీన్ గా జరిగే విషయాలే. కేసీఆర్ సవాల్ ను స్వీకరించామని చెప్తున్న బిజెపి వ్యాఖ్యలను కౌంటర్ చేస్తూ మళ్ళీ ఏదొకటి టీఆర్ఎస్ నేతలు అనడం… దానికి కౌంటర్లు వేయడం… మరో రెండేళ్ళ పాటు ఇలాంటి సన్నివేశాలను ఎన్ని చూడాలో..! అంతా రాజకీయ మిధ్య..!