KCR Federal Frontజాతీయస్థాయి రాజకీయాలలో గుణాత్మక మార్పు తీసుకుని రావడానికి బీజేపీ, కాంగ్రేసేతర ఫెడరల్ ఫ్రంట్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేస్తున్న అడుగులు రెండు ముందుకైతే నాలుగు వెనక్కు పడుతున్నాయి. ఇప్పటికే మమతా బెనర్జీ కాంగ్రెస్ తో పొత్తు లేకుండా ముందుకు సాగడం కష్టమని స్పష్టం చెయ్యగా, మిగిలిన వారు అదే అభిప్రాయ పడుతున్నారు.

ఇటీవలే కేసీఆర్ ను కలిసిన మాజీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అదే మాట చెప్పారట. తాజాగా తమిళనాడు డి.ఎమ్.కె. తాము కాంగ్రెస్ తో పొత్తు వదలుకోబోమని స్పష్టం చేసింది. ఆ పార్టీ ఎమ్.పి కనిమొళి మాట్లాడుతూ తమకు కాంగ్రెస్ కు దూరం అయ్యే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలు ప్రాథమిక దశలోనే ఉన్నాయన్నారు. భావసారూప్యత కలిగిన పార్టీలతోనే ముందుకు వెళ్తామని, అంతమాత్రాన పాత మిత్రులను వదులుకునే ఉద్దేశం లేదని చెప్పారు. అంటే ఇప్పటికైతే కెసిఆర్ తో జరిగినవి మర్యాదపూర్వక సమావేశాలే అనుకోవాలి. కర్ణాటక ఎన్నికల తరువాత హంగ్ వస్తే జెడీఎస్ కూడా జారిపోయే అవకాశం ఉంది.