KCR Famersజీహెచ్ఎంసి ఎన్నికల అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఢిల్లీ వెళ్లి వచ్చారు. అక్కడ ఏం అయ్యిందో ఏమో గానీ రెండు కీలక విషయాలలో తన వైఖరి మార్చుకున్నారు. గత ఏడాది తాము చెప్పిన పంటలనే ఆయా ప్రాంతాల రైతులు వేయాలని షరతు పెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది నుంచి అలాంటి నియంత్రణలు ఉండవని ప్రకటించింది.

ఇకపై రాష్ట్రంలో నియంత్రిత సాగు విధానం అవసరం లేదని, రైతులు ఏ పంట వేయాలో ఇకపై వాళ్లదే నిర్ణయమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. అదే సమయంలో ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయం చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ లో పాల్గొన్న తెరాస ఇప్పుడు ఆ చట్టాలకు అనుకూలంగా వ్యవహరించడం గమనార్హం.

గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలు వచ్చే ఏడాది నుండి ఉండవని..రైతులు పంటకు ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడే అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు. పంట కొనుగోలు ద్వారా మొత్తం రూ.7,500 కోట్లు నష్టం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లను కేసీఆర్ కలిసి వచ్చిన తర్వాత ఈ మార్పు వచ్చిందా?

అసలు ఆ మీటింగ్ లో ఏం జరిగింది? అని ఇప్పుడు అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక ఎన్నికల తరువాత బీజేపీతో తెరాస కలిసి పని చెయ్యనుందా? అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పు గమనార్హం. ఒకవేళ అదే నిజమైతే జీహెచ్ఎంసీ లో కూడా పొత్తు ఉంటుందా?