jupally rameshwar rao - KCRపరారీలో ఉన్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ఒక సీనియర్ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలనమైన విషయాలు చెప్పారు. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మీడియాను తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే దీనికోసం ఆయన మిత్రుడు మై హోమ్ రామేశ్వరరావుతో పావులు కలిపిస్తున్నారట. ఇప్పటికే 10టీవీని సొంత చేసుకున్న రామేశ్వరరావు, ఎన్టీవీలో కూడా వాటాలు కొన్నారని రవిప్రకాష్ చెప్పుకొచ్చారు.

ఇప్పుడు ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాలలో నెంబర్ 1 ఛానల్ ఐన టీవీ9లో 90.56% వాటా దక్కించుకున్నారు. దీనితో పాటు మరిన్ని ఛానల్స్ లో వాటాలు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని రవిప్రకాష్ కేసీఆర్ పేరు చెప్పకుండా ఆరోపించారు. ఇటీవలే ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల మీద టీవీ9 లో వచ్చిన కథనాల వల్లే తనను కేసులలో ఇరికించారని ఆయన ఆరోపించారు మరోవైపు రవిప్రకాష్ కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటివరకు విచారణకు హాజరు కావాలని అనేక నోటీసులు ఇచ్చినా రవిప్రకాష్ స్పందించడం లేదు.

ఇది ఇలా ఉండగా రవిప్రకాష్ ఏదో ఒక ఛానల్ ను టేక్ ఓవర్ చేస్తారని విరివిగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం రవిప్రకాష్ వద్ద ప్రస్తావించగా ప్రస్తుతం అటువంటిది ఏమీ లేదని, తన దృష్టాంతా తన మీద పెట్టిన దొంగ కేసుల నుండి బయటపడటం మీదే ఉందని ఆయన చెప్పుకొచ్చారని. అయితే తన జీవితంలో ఇది ఒక టెంపరరీ ఫేజ్ మాత్రమే అని, పోలీసులు ఈ కేసులో అనవసరంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని రవిప్రకాష్ చెప్పడం విశేషం.