Bandi Sanjay Kumar - KCRతెలంగాణలో బీజేపీ అనూహ్యంగా బలపడింది. దుబ్బాక, జీహెచ్ఎంసి ఎన్నికల గెలుపుతో ఆ పార్టీ మంచి ఊపు మీద ఉంది. ఈ సారి తెలంగాణలో అధికారం మాదే అంటుంది. ఇక బీజేపీని ఎలా నిలువరించాలి అనేదాని మీద ముఖ్యమంత్రి కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. అయితే బీజేపీ విషయంలో రెండు ఆప్షన్లు ఓపెన్ గా పెట్టుకున్నారు కేసీఆర్.

తాను బీజేపీ మీద వ్యతిరేకంగా మాట్లాడకుండా… అదే సమయంలో జాతీయ స్థాయిలో, పార్లమెంట్ లో అవసరమైనప్పుడు బీజేపీకి సహకరిస్తుంది తెరాస. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దగా స్పందించింది కూడా ఏమీ లేదు. మరోవైపు… కేటీఆర్ మాత్రం అందుకు భిన్నంగా బీజేపీ పై పూర్తి అటాకింగ్ మోడ్ లో వెళ్తున్నారు.

ట్విట్టర్, మీడియా, శాసనసభ అనే తేడా లేకుండా బీజేపీని తెలంగాణకు ఏమీ చెయ్యలేదు అంటూ ఎండగడుతున్నారు. అయితే ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. 2023 ఎన్నికల నాటికి బీజేపీతో దోస్తీ లేదా కుస్తీ రెండిటికీ తెరాస రెడీ అవుతుంది.

బీజేపీ పొత్తుకు ప్రయత్నాలు చేస్తే కేసీఆర్ వైఖరితోనే తెరాస ఎన్నికలకు వెళ్తుంది. ఒకవేళ రెండు పార్టీలు ఢీ కొనాల్సి వస్తే మాత్రం కేటీఆర్ వైఖరి ఉండనే ఉంది. ఒకరకంగా ఇది రాజకీయంగా మంచి ఎత్తుగడే… అయితే ఏ మేరకు ఫలిస్తుంది? ఎటు వెళ్తుంది ఫైనల్ గా అనేది చూడాలి.