Revanth Reddy Arrestedఅధికారంలోకి వచ్చిన నాటి నుండి తనకు కంటగింపుగా మారిన రేవంత్ రెడ్డి పై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉన్న శత్రుత్వం మన అందరికీ తెలియనిది కాదు. ప్రతిపక్షంలో కేసీఆర్ ను ఎదురుకోగల ఒకే ఒక వ్యక్తి రేవంత్. ఓటుకు నోటు కేసు లేకపోతే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండేది. అయితే ఈ సారి ఎలా అయినా రేవంత్ ను అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకూడదని డిసైడ్ అయ్యారు కేసీఆర్. రేవంత్ పై ఆర్ధికంగా రాజకీయంగా బలమైన అభ్యర్థిని నిలబెట్టారు. గ్రౌండ్ లెవెల్ లో పూర్తి సహకారంతో కొడంగల్ లో ప్రచారం చేస్తున్నారు.

కేసీఆర్ కి ఉన్న సర్వే ప్రకారం రేవంత్ రెడ్డి ఈసారి అక్కడ గెలవడం అంత తేలిక కాదు. అయితే తెరాస గత వారం రోజులుగా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ పోతుంది. ఎన్నికల ప్రకటన రాగానే రేవంత్ పై ఏకంగా ఈడీ దాడులు చేసింది. అరెస్టు చేస్తారని పుకార్లు వచ్చాయి. అయితే కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు. దానితో ఇది కేవలం ప్రభుత్వం చేసిన కక్ష సాధింపు చర్య అని అందరికీ అర్ధమైపోయింది. ఎన్నికలు సమీపిస్తుండగా రేవంత్ ను వేరే నియోజకవర్గాల ప్రచారం కు వెళ్లకుండా కొడంగల్ లోనే ఉండే లా ప్లాన్ చేసారు.

దీనిలో భాగంగా రేవంత్ మనుషుల మీద అర్ధరాత్రి ఐటీ దాడులు చేయించారు. వరుసగా రోజుల పాటు జరిగిన ఈ దాడులలో కూడా అధికారాలకు ఏమీ దొరకలేదు. రేవంత్ అర్ధరాత్రి మెరుపు ధర్నాకు దిగి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. రేవంత్ లాంటి బలమైన లీడర్ ను ఢీ కొట్టడానికి వ్యవస్థ అంతా కదులుతోంది అని కొడంగల్ ప్రజల ఉద్దేశం. నేడు కేసీఆర్ కొడంగల్ లో సభకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. దానికి ప్రతిగా తెల్లవారు జాము ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేశారు పోలీసులు.

ఎన్నికలకు మూడు రోజుల ముందు జరిగిన ఈ పరిణామంతో కొడంగల్ ఎన్నిక వన్ సైడ్ అయ్యే అవకాశం ఉంది. పైగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహాకూటమి శ్రేణులలో పట్టుదల పెంచుతుంది. ఎన్నికలకు కొద్దీ రోజుల ముందు ఇది కాంగ్రెస్ కు రేవంత్ కు కలిసొచ్చేదే. ఒకరకంగా శాసనసభను రద్దు చేసిన నాటి నుండి రేవంత్ విషయంలో కేసీఆర్ వరుసగా తప్పులు చేసుకుంటూనే వస్తున్నారు. దాని వల్ల కోల్పోయేది కేవలం కొడంగల్ సీటు మాత్రమే అయితే కేసీఆర్ పెద్దగా మూల్యం చెల్లించుకోనట్టే