KCR - D Srinivasగత నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కవిత నేతృత్వంలో ఆ పార్టీకు చెందిన నిజామాబాదు నాయకులు రాజ్యసభ ఎంపీ డీ శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన మీద చర్య తీసుకొవాలని ఒక తీర్మానం పంపారు. బీజేపీలో ఉన్న తన కుమారుడు అరవింద్ కు మేలు చెయ్యడం కోసం డీఎస్ మీద ఆరోపణ.

అరవింద్ కవిత మీద నిజామాబాదు ఎంపీ స్థానానికి పోటీ చెయ్యబోతున్నారు. ఆయన కేసీఆర్ అప్పాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ దశలో డీఎస్‌ మరో తనయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి గురువారం ఫిర్యాదు చేసారు.

ఆరు నెలలుగా తమను సంజయ్‌ లైంగికంగా వేధిస్తున్నాడని 11 మంది విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు చెందిన శాంకరి కాలేజీలో చదువుతున్న విద్యార్థినులపై సంజయ్‌ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్‌ను అరెస్ట్‌ చేయాలనీ, శాంకరి నర్సింగ్‌ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి.

ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు. ఇది కేసీఆర్ మార్కు వేధింపు అని డీఎస్ వర్గం ఆరోపిస్తుంది. తనను ధిక్కరించే ప్రయత్నం చేస్తే ఏమీ జరుగుతుందో కేసీఆర్ రాజ్యసభ ఎంపీకు ఆయన కుటుంబానికి చెప్పకనే చెప్పారు అని వారు అంటున్నారు.