Telugu

కేసీఆర్ కు కరోనా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం

Share

హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఆదాబ్ హైదరాబాద్ అనే దినపత్రికలో వచ్చిన కథనం ప్రకారం… తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కు కరోనా సోకిందని గట్టిగా ప్రచారం జరుగుతుంది. సీఎం క్యాంపు ఆఫీసు లోని ముప్పై మందికి ఇప్పటికే కరోనా సోకిందని వచ్చిన వార్త మన అందరికీ తెలిసిందే.

ఈ మధ్యనే నర్సాపూర్ లో హరితహారం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆ కార్యక్రమం నుండే ఆయనకు వైరస్ సోకి ఉండవచ్చని ఆ కథనంలో పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా కేసీఆర్ తన ఫార్మ్ హౌస్ కే పరిమితం అయిపోయారు. దీనితో ఆయనకు అక్కడ సీక్రెట్ గా చికిత్స చేస్తున్నారు అంటూ ఆ పత్రిక పేర్కొంది.

వారం రోజులుగా కేసీఆర్ ఫార్మ్ హౌస్ లోనే ఉండడం… అక్కడ నుండే సమీక్షలు చెయ్యడం నిజమే. మీడియా ముందుకు రావడం తగ్గించారు అయితే తరచు హైదరాబాద్ నుండి మాయం అయిపోయి… ఫార్మ్ హౌస్ నుండి పాలన చెయ్యడం కేసీఆర్ కు పరిపాటే. ఇది ఊహాజనితమైన కథనం అని తెరాసలోని కొందరు అంటున్నారు.

మరోవైపు… తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాలుస్తుంది. నిన్న ఒక్క రోజే 1850 కేసులు నమోదు అయ్యాయి. దానితో మొత్తం కేసులు 22,312కు చేరాయి. అలాగే ఈ మహమ్మారి కారణంగా ఇప్పటివరకూ 288 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. కరోనా ప్రబలుతున్నా ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.