jupally-rameshwar-rao-KCRమార్చి లో ఖాళీ అయ్యే 55 రాజ్య సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ కు నాలుగు, తెలంగాణకు రెండు స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి. రెండు రాష్ట్రాలలోని అధికార పార్టీలు వీటిని దక్కించుకుంటాయి. ఈరెండు సీట్ల కోసం అధికార రాష్ట్ర సమితి విపరీతమైన పోటీ ఉండటం గమనార్హం.

మైహోమ్ రామేశ్వరరావు, దామోదర్ రావు, ట్రాన్స్కో ప్రభాకరరావు, వినోద్, కవిత, పొంగులేటి, హెటిరో పార్ధసారధి, కేటీఆర్ సన్నిహితుడు ప్రవీణ్ ఆశావహుల లిస్టులో ఉన్నట్టు సమాచారం. అయితే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మైహోమ్ రామేశ్వరరావు అన్నింటా కీలకంగా వ్యవహరిస్తున్నారు.

కేసీఆర్ కు ఆయన అత్యంత సన్నిహితుడిగా పేరు. పైగా టీవీ9లో వాటా కొనుగోలు చెయ్యడంతో ఆయన పాత్ర మరింత పెరిగింది. దీనితో ఆయనను రాజ్యసభకు పంపడం ఖాయంగా కనిపిస్తుంది అంటున్నారు. అయితే ఆయనను గనుక పంపితే కేసీఆర్ కుమార్తె కవితకు అవకాశం దక్కదు.

ఎందుకంటే ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. ఒక సీటు వెలమలకు, ఒక సీటు రెడ్లకు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆ ప్రాతిపదికన ఒకరికి ఇప్పుడు, ఇంకొకరికి తరువాత విడతలో అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫైనల్ గా కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.