KCR concentrating more on chandrababu naidu than electionsఉన్నఫళంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తెలుగు దేశం అధినేత చంద్రబాబునాయుడుపై విరుచుకుపడటం మనం చూస్తున్నాం. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కేసీఆర్ చంద్రబాబు రాగం అందుకుని తనదైన శైలిలో ఆయనను మాటలు అంటున్నారు. ఇప్పుడు కూటమి గెలిస్తే.. ప్రాజెక్టులు ఆగిపోతాయిని కేటీఆర్ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు చంద్రబాబు ఢిల్లీకి 30 ఉత్తరాలు రాశారని అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయా? అని ప్రశ్నించారు. విలువలకు తిలోదకాలు ఇచ్చి కాంగ్రెస్, టీడీపీ ఒక్కటయ్యాయని విమర్శించారు. కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల జుట్టు చంద్రబాబు చేతిలో ఉంటుందన్నారు.

కరెంట్ అడిగితే కాల్చి చంపినవాళ్లకు ఓటు ఎలా వేస్తాం అని ప్రజలనుద్దేశించి ఆయన అన్నారు. గట్టిగా 15 సీట్లలో పోటీ చేసి మహా అయితే ఆ పదిహేను గెలిచే పార్టీ ప్రభుత్వాన్ని శాసిస్తుంది అని ప్రజలను నమ్మించి కాంగ్రెస్ కు ఓటు వెయ్యకుండా ఆపడమే తెరాస వ్యూహంగా కనిపిస్తుంది. వారి వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి