KCR -Jaganతెలంగాణ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు అని చెబుతున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కృష్ణా బేసిన్‌లో ఏపీ సర్కారు అక్రమ ప్రాజెక్టులు చేపడుతున్నదంటూ వాటిని అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారట. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారట.

“మన రాష్ట్రానికి అన్యాయం చేసే విషయంలో సీఎం రాజశేఖర్‌రెడ్డి కంటే మూర్ఖంగా జగన్‌ ముందుకెళ్తున్నారు… ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌కు చట్టాలపై ఏమాత్రం గౌరవం లేదు అనడానికి ఈ అక్రమ ప్రాజెక్టులే నిదర్శనం… తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీళ్లను ఎత్తుకుపోతున్నారు… ఇప్పుడు మనం మౌనంగా ఉంటే తప్పు చేసినట్లే… మనపై నమ్మకం పెట్టుకున్న తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినట్టే,” అని కేసీఆర్ అన్నారట.

జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంతో సఖ్యతతో మెలిగారు… నిజానికి 2019లో జగన్ గెలుపు కోసం కేసీఆర్ తెరవెనుక నుండి ఎంతో సాయపడ్డారనే వద్దంతులు కూడా ఉన్నాయి. జగన్ గెలిచాకా విందులు, సమావేశాలు అంటూ ఎంతో సఖ్యతగా మెలిగారు. ఏకంగా రెండు ప్రభుత్వాలు ఉమ్మడి ప్రాజెక్టులు కడతాం అని ప్రకటించారు.

అయితే ఆ ప్రాజెక్టులు తెలంగాణ కే ఎక్కువ ఉపయోగం అంటూ జగన్ పక్కకు తప్పుకున్న నాటి నుండీ ముఖ్యమంత్రుల మధ్య దూరం పెరిగినట్టు ఉంది. అయితే ఇద్దరు బాహాటంగా ఎప్పుడు బయటపడలేదు. ఒకవేళ బయటపెడితే అది తమ ఉమ్మడి శత్రువు కేసీఆర్ కు లాభం అనుకున్నారో ఏమో. అయితే జగన్ ను మూర్ఖుడు అనే అంతగా వారి మధ్య చెడింది అంటే ఆశ్చర్యకరమే.