kcr-chandrababu-naidu-national-politicsరెండు తెలుగు రాష్ట్రాల చంద్రులు సార్వత్రిక ఎన్నికల ఫలితాల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేంద్రంలో హంగ్ రావాలని చక్రం తిప్పాలని ఇద్దరికీ బలీయమైన కోరిక ఉంది. తెలంగాణాలో రెండో సారి అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్ ఇప్పుడు కొడుకుని పట్టాభిషిక్తుడిని చేసి ఢిల్లీకి మకాం మార్చాలని ఆరాటపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన నాకు ఢిల్లీని సాధించడం ఏదైనా కష్టమా అని ఆయన అభిప్రాయం. తెలంగాణాలో 16కు 16 వచ్చి హంగ్ వస్తే ఆ ముచ్చట ఏమీ కష్టం కాదు.

తెలంగాణాలో అధికారంలో ఉన్న కేసీఆర్ కు వస్తే కొండ, పోతే వెంట్రుక అయితే చంద్రబాబు పరిస్థితి మాత్రం అలా కాదు. కేంద్రంలో నరేంద్ర మోడీ సొంతంగా అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడుని ముప్పతిప్పలు పెట్టడం ఖాయం. రాజకీయ ప్రత్యర్థుల మీద సిబిఐ, ఐటీ, ఈడీలని ప్రయోగించడం మోడీకి ఇష్టమైన ఆట. ఆ ఆటను ఇప్పటికే ఆయన ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెట్టారు. సొంతంగా అధికారంలోకి వస్తే ఇక చంద్రబాబుకు కష్ట కాలం అనే అనుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వస్తే కొంతలో కొంత పరిస్థితి మెరుగు పడొచ్చు. దీనితో చంద్రబాబుకు మే 23న జీవన్మరణ సమస్య అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికోసమే చంద్రబాబు పక్క రాష్ట్రాలకు కూడా వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. దీనితో మే23న ఏం జరగబోతుంది అనే ఆసక్తి ఇద్దరు చంద్రులలో ఉంది. ఏడు విడతలలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఇప్పటిదాకా నాలుగు విడతలు పూర్తి అయ్యాయి. మే 19న చివరి దశ ఎన్నికలు ఆ రోజు సాయంత్రం పోలింగ్ పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాబోతున్నాయి.