KCR -Chandrababu-Naidu
బుధవారం కుమారస్వామి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యబోతున్నారు. బలమైన బీజేపీని ఢీకొని గెలిచినందున ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా బీజేపీని ఎదిరించి పోరాడుతున్న అన్ని ప్రాంతీయ పార్టీ నేతలకు ఆహ్వానాలు పంపుతున్నారట. చంద్రబాబు నాయుడు, కేసీఆర్, మాయావతి, అఖిలేష్ యాదవ్, మరియు చాలా మంది జాతీయ నేతలకు ఆహ్వానం అందిందట.

అయితే ఇద్దరు చంద్రులు ఈ కార్యక్రమానికి హాజరు అవుతారా లేదా అనేది చూడాలి. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు దీనికి సంశయిస్తున్నట్లు సమాచారం వచ్చింది. కాంగ్రెస్‌– జేడీఎస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రమాణస్వీకారానికి వెళ్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు భావిస్తున్నట్లు సమాచారం.

కేసీఆర్ కు కాంగ్రెస్ తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ను విభజించి ఇబ్బందులు పాలు చేసిన పార్టీ కాంగ్రెస్ దీనితో వెళ్ళడానికి చంద్రబాబు సంశయిస్తున్నారట. దీనితో ఇద్దరు చంద్రులు తమ క్యాబినెట్ లో మంత్రులెవరినైనా పంపి ఊరుకునే అవకాశం ఉందట.