KCR -chandi homamదేవుడు, వాస్తు, నమ్మకాలు వంటివి కేసీఆర్ కు చాలా ఎక్కువ. ఆయన ఏ పని చేసినా ముహూర్తం, లగ్నం వంటివి చూసుకునే మొదలు పెడతారు. అసెంబ్లీ రద్దు చేసినా, నామినేషన్ వేసినా ఏదైనా రాజయోగం పట్టే ముహూర్తం చూసుకుని మొదలు పెట్టాల్సిందే. 2015లో కేసీఆర్‌ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం వద్ద అయుత చండీయాగం నిర్వహించిన ఆయన ఎన్నికల ముంగిట మరో యాగం చేపట్టారు. విశాఖ స్వరూపానంద స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో రెండు రోజుల పాటు జరిగే రాజశ్యామల, చండీసహిత రుద్ర హోమాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి.

120 మంది ఋత్విక్కులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘కామ్యసిద్ధి’ కోసం జరిపే ఈ హవనంతో పాటు నవగ్రహ పాశుపతం, సూర్యనమస్కారాలు, రుద్రక్రమార్చన, రుద్రాభిషేకం, రుద్రహోమం కూడా చేయించనున్నారు. రాజశ్యామల చండీ హోమంలో కేసీఆర్‌ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. చండీసహిత రుద్రహోమంలో కేసీఆర్‌ అనుచరులు, ముఖ్యనేతులు పాల్గొన్నారు. మలి విడత ప్రచారం ప్రారంభించడానికి ముందుగా ఈ హోమం చేస్తున్నారు.

దేవుడి అశీసులతో ప్రచారం మొదలు పెడితే సంకల్పం సిద్ధిస్తుందని కేసీఆర్ నమ్మకం. అయితే 2015 సమయంలో హంగుఆర్బాటాలతో యాగం చేసిన కేసీఆర్ ఈ సారి మాత్రం సైలెంట్ గా కానిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు దీనిపై విమర్శలు మొదలు పెట్టాయి. ఓటమి భయంతోనే కేసీఆర్ హోమం చేస్తున్నారని, ఈసారి ఆయనను ఏ దేవుడూ కాపాడలేరని అంటున్నారు. మరోవైపు రేపటి నుంచి 25 వ‌ర‌కూ రాష్ట్రంలో నిర్వ‌హించ‌బోతున్న బ‌హిరంగ స‌భ‌ల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు