KCR Telangana Chief Ministerతెలంగాణ రాష్ట్రసమితి కొత్త నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని ఆలోచన చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ‘కేసీఆరే మా సారు’ అన్నది ఆ నినాదం అని కొన్ని కధనాలు చెబుతున్నాయి.ఈ నినాదం ప్రజలలో క్లిక్ అవుతుందని పార్టీ వారు భావిస్తున్నారు. కేసీఆరే ఇప్పుడు తెలంగాణాలో అతిపెద్ద బ్రాండ్ అని వారు భావిస్తున్నారట.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేసిన పథకాలు, ప్రజల్లో వాటి ప్రభావంపై టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సర్వే చేయించారు. సంక్షమ పథకాల కన్నా ఎక్కువగా కేసీఆర్‌కే అన్నివర్గాలు ఆదరణ చూపించినట్లు సర్వే ఫలితాలు రావడంతో ఆ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఇప్పటికే కేసీఆర్ ను దొర అని, తెలంగాణ రాష్ట్ర సమితిది దొరల పాలన అని అంతా విమర్శిస్తున్నారు. సారూ అనే పదం అలా వ్యక్తిస్వామ్యాన్ని సూచించే ప్రమాదం లేకపోలేదు. దానివల్ల కొంచెం అప్రమత్తంగా ఉండటం ఎంతైనా మేలు. ఫైనల్ గా దీనిపై కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.