KCR - Etela Rajendra తెలంగాణ ప్రభుత్వ ఆర్దిక నిర్వహణ తీరుతెన్నులపై కాగ్ చేసిన వ్యాఖ్యలు అధికారపార్టీని ఇరుకున పెట్టేవిగా ఉన్నాయి. లోటు బడ్జెట్ ను కప్పిపుచ్చడని అప్పులు తెచ్చి మసిపూసి మారేడుకాయ చేసి మిగులు రాష్ట్రంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కాగ్ ఆక్షేపించింది. విభజనానంతరం మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను లోటు రాష్ట్రంగా మార్చిన అపఖ్యాతి తప్పించుకునే ప్రయత్నం ఇది.

అయితే ఆర్దిక మంత్రి ఈటెల రాజేందర్ ను దీనికి బాధ్యుడిని చేసే ప్రయత్నం జరుగుతుందట. ఈ విషయాలలో ముఖ్యమంత్రి ఈటెలపై సీరియస్ అయ్యారని మీడియాకు లీకులు ఇచ్చారు. శాఖపరంగా సమర్దంగా ఆర్దికంగా నిర్వహణ చేయలేకపోయారని కెసిఆర్ అసంతృఫ్తి వ్యక్తంచేశారట.

తెలంగాణాలో ఏ మంత్రి సొంతంగా పనిచేయ్యడం లేదని అంతా కేసీఆర్, కేటీఆర్ కనుసన్నల్లోనే జరుగుతూ ఉంటాయని ఎప్పటినుండో ఉన్న మాటే. బడ్జెట్ తయారికి సంబందించి కొన్నిసార్లు అసలు మంత్రికి తెలియకుండానే ముఖ్యమంత్రి సమీక్షలు చేసినట్లు వార్తలు వచ్చాయి.ఇప్పుడు ఈటెలను తప్పు చేశారంటే న్యాయమా?