KCR Astrology - Snap Polls-మరో ఏడెనిమిది నెలల పాటు అధికారం చేతిలో ఉన్నా, దానిని పక్కనపెట్టి ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేయబోతున్నారు? అనేదే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఇంతకుమించిన చర్చ ఏమీ లేదు.

2003లో ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఎలా అయితే చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్ళారో, అదే రూట్ ను అనుసరిస్తూ, కేసీఆర్ కూడా ఏకవాక్య తీర్మానంతో గురువారం ఉదయం 6.45 నిముషాలకు అసెంబ్లీని రద్దు చేసిన పిదప, గవర్నర్ వద్ద వెళ్ళనున్నారని ప్రస్తుతం సమాచారం హల్చల్ చేస్తోంది.

ఇదంతా కేసీఆర్ జాతకరీత్యా పెట్టిన ముహూర్త బలంగా తెలుస్తోంది. కేసీఆర్ కు బాగా అనుకూలించే సంఖ్య ‘6’ను ప్రామాణికంగా తీసుకుని, డేట్ అండ్ టైం ఖరారు చేసారు. 6వ తేదీ ఉదయం ఉదయం 6.45 నిముషాలు అంటే టోటల్ కూడా 6 కావడంతో ఇలా ముహూర్తాన్ని సిద్ధం చేసినట్లుగా మీడియా వర్గాల్లో ప్రధాన చర్చలు జరుగుతున్నాయి.

అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్ళీ అధికారంలోకి వచ్చిన ట్రాక్ రికార్డు ఎక్కడా లేకపోవడంతో, కేసీఆర్ ఈ సారి చరిత్ర సృష్టిస్తారా? లేక ట్రెండ్ ను ఫాలో అవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా డిసెంబర్ లోపున మళ్ళీ కొత్తగా అధికార పగ్గాలు చేపట్టాలనే కృతనిశ్చయంతో తెలంగాణా ముఖ్యమంత్రి వేగంగా అడుగులు వేస్తున్నారు.