KCR TRS2019 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకా నిద్రావస్థలోనే ఉండగా… తెలంగాణ రాజకీయాలు మాత్రం వేగంగా మారుతున్నాయి. బీజేపీ పంచుకోవడంతో తెలంగాణ రాష్ట్ర సమితికి మునుముందు ఇబ్బందులు తప్పవా అంటూ అంతటా చర్చ జరుగుతుంది.

మరోవైపు… ఏడాది కాలం నుండి బీజేపీ తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించడంతో కాంగ్రెస్ కూడా అలెర్ట్ అయ్యింది. సీనియర్లు, వారి అలకలు, బెదిరింపులను పక్కన పెట్టి తమకు ఉన్నఒకే ఒక్క అవకాశమైనా రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేసింది. బీజేపీకి బండి సంజయ్, కాంగ్రెస్ కి రేవంత్ ఇద్దరు మాస్ ఇమేజ్ ఉన్న నేతలు.

పైగా ఇద్దరు తొందరలో పాదయాత్ర పేరిట రాష్ట్రమంతా చుట్టిరావాలని ఆలోచన చేస్తున్నారు. అంటే ఇద్దరు వచ్చే ఎన్నికల వరకు ఎక్కువగా ప్రజల్లోనే ఉండి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలలో నోరు ఉన్న నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే జాతీయ పార్టీలు రెండూ తమ అధ్యక్షులను ఫైనల్ చేశాయి.

గతంలో కేసీఆర్ కు కూడా అదే బెనిఫిట్ అయ్యింది. తమ వాగ్ధాటి సంజయ్, రేవంత్ లకు ప్లస్ అవుతుంది. ఈ తరుణంలో గతంలో లాగా ఫామ్ హౌస్ లోనే కూర్చుకుని రాజకీయాలు చేస్తాం అంటే కుదిరే పరిస్థితి కాదు. కేసీఆర్ ప్రజల మధ్య ఉండి వారిద్దరి ఎఫెక్ట్ ఎప్పటికప్పుడు న్యూట్రలైజ్ చేస్తూ ఉండాలి. లేకపోతే 2023 అంత తేలికగా ఉండదు.

గతంలో కేసీఆర్ తరపున అంతా తానే అన్నట్టు కేటీఆర్ వ్యవహరించారు. ప్రస్తుత పరిస్థితులలో అది కూడా సాధ్యపడేలా లేదు. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దూకకపోతే ఇబ్బందే.