KCR- Ayutha Maha Chandi Yagam beginsతెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ప్రతిష్టాత్మకమైన అయుత చండీ యాగం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభమైంది. 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరగనున్న ఈ అయుత చండీ యాగానికి, దేశ ప్రధాని, రాష్ట్రపతితో సహా అనేక మంది ప్రముఖులను కేసీఆర్ ఆహ్వానించారు. దాదాపు 7 కోట్లు ఖర్చు పెట్టి ఈ యాగాన్ని కేసీఆర్ నిర్వహిస్తున్న ఈ యాగంపై నేషనల్ మీడియా పలు ఆసక్తికరమైన కధనాలు ప్రసారం చేస్తోంది.

కేసీఆర్ యాగం జరుగుతున్న కొద్ది దూరంలోనే పీర్లపల్లికి చెందిన రైతు నల్లా కిష్టయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ… తెలంగాణాలో రైతులను కేసీఆర్ సరిగా పట్టించుకోవడం లేదని, యాగాల పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నారని కధనాలు ప్రసారం చేస్తోంది. అయితే, తెలంగాణా సర్కార్ నుండి ఒక్క పైసా కూడా ఖర్చు చేయడం లేదని, ఈ యాగానికి అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. చూడబోతుంటే… నేషనల్ మీడియా కధనాలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసేలా కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.