KCR at nbk Gautamiputra Satakarni Movie Openingఅనంతపురం జిల్లా హిందూపురం శాసన సభ్యుడు, తెలుగు సినీ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ వందవ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంచన ప్రారంభ వేడుక హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిపేందుకు భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు… ఇద్దరూ హాజరు కానున్నట్లు ప్రచారం సాగింది.

అయితే తాజా సమాచారం మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టినట్లు సమాచారం. చివరి నిముషంలో ఏర్పడిన అనివార్య కారణాల వల్ల చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని తెలుస్తోంది. అయితే, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అంతేకాదు ఈ సినిమాకు తొలి క్లాప్ ను కేసీఆరే కొట్టనున్నారు. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులతో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు దిగ్గజ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు.