KCR asks Rs 20000 crores for kaleshwaram projectకాళేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్లు వ్యయమవుతుంది. 20 జిల్లాల పరిధిలోని 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, ఆయా ప్రాంతాల్లో తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు ఈ ఎత్తిపోతల నీరు వినియోగించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్‌ నుంచి రూ.25 వేల కోట్లు కేటాయించారు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి రూ.22 వేల కోట్ల రుణాలు తీసుకున్నారు

ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా కేంద్రం రూ.20 వేల కోట్లు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ కు ఇస్తామని ప్రమాణం చేసినా ఇవ్వని కేంద్రం మిగులు రాష్ట్రమైన తెలంగాణకు ఆర్ధిక సాయం చేస్తుందా? ఇది అత్యాశ కాకపోతే ఏంటి?

బహుశా అడిగి లేదనిపించుకుంటే ఎన్నికలలో బీజేపీని ఇరుకున పెట్టడానికి ఉపయోగపడుతుంది అనేది ఆయన వ్యూహం కావొచ్చు. ని మోదీని కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ శని, ఆదివారాలు దిల్లీలోనే ఉండనున్నారు. ఆదివారం నీతిఆయోగ్‌ సమావేశంలో పాల్గొననున్నారు. సోమవారం ఉదయం ఆయన తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.