KCR as Lord Ramaఇటీవల కాలంలో అభిమానాన్ని ప్రదర్శించడంలో చూపుతున్న ఉత్సుకత పలు విమర్శలకు దారి తీస్తోంది. ముఖ్యంగా కోట్లాది భక్తులు దైవంగా కొలిచే దేవుళ్ళను తమ అభిమానాన్ని ప్రదర్శించడానికి ఉపయోగించుకోవడం విశేషం. తాజాగా ఈ కోవలోనే వాట్సప్ వంటి సోషల్ మీడియాలలో ఒక ఫోటో హల్చల్ చేస్తోంది.

‘శ్రీరామనవమి’ పర్వదినం సందర్భంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ‘రాముని’ అవతారంలో కీర్తిస్తూ ఓ ఫోటోను మార్ఫింగ్ చేసారు. కేసీఆర్ అనుచరులు, అభిమానులు ద్వారా సర్క్యులేట్ అవుతున్న ఈ ఫోటోపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణా కల సాకారం చేసిన వ్యక్తిగా కేసీఆర్ పై ఎంతటి అభిమానమైనా చూపించుకోవచ్చు గానీ, అది పక్కన వారిని ఇబ్బంది పెట్టే విధంగానూ, విమర్శలకు దారి తీసే విధంగానూ ఉండకూడదు అన్నది పరిశీలకుల భావన. ఏమంటారు… అబ్బాయిలూ…!