KCR Elections -20192014 ఎన్నికల పోలింగ్ ముగియగానే కేసీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు. తాము గెలవడం ఖాయమని, ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి గెలుపు సునాయాసమని ఎటువంటి వివాదాలు లేకుండా జగన్ తో కలిసి పని చేస్తామని చెప్పుకొచ్చారు. తన వద్ద సర్వేలు ఉన్నాయని కాన్ఫిడెంట్ గా చెప్పారు. జగన్ ఏమన్నా అంటరాని వాడా? చంద్రబాబుకు అంటరాని వాడు కావొచ్చు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. అయితే ఫలితాలు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఫలితం పూర్తిగా తారుమారు అయిపోయింది.

ఈ ఎన్నికలలో కూడా కేసీఆర్ కు దాదాపుగా అదే సర్వే తెలిసింది. అయితే గత అనుభవం వల్ల ఆయనకు మీడియా ముందుకు వచ్చే ధైర్యం చాలలేదు. దీనితో అసలు పార్లమెంట్ ఎన్నికల తరువాత ఆయన మీడియాతో మాట్లాడిందే లేదు. మాట్లాడితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి. అందుకే కీలకమైన ఇంటర్మీడియట్ వివాదం చెలరేగుతున్నప్పుడు కూడా ఆయన మీడియా ముందుకు రాలేదు. మే 23న జగన్ గెలిస్తే అదే సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడతారట.

ఆ తరువాత జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి కూడా హాజరు అయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికలలో తెరాస ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ కు పూర్తిగా సహకరించిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ కు డబ్బు సమకూర్చారని, టీడీపీ అభ్యర్థులను తమ హైదరాబాద్ ఆస్తులను చూపించి బ్లాక్ మెయిల్ చేసారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీనితో ఈ ఎన్నికలు దాదాపుగా కేసీఆర్, చంద్రబాబుల మధ్య జరిగినట్టే జరిగాయి. ఫలితం ఎలా ఉండబోతుందో ఈ నెల 23న తేలబోతుంది.