KCR - After Eye Surgery Photos Viralతెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నల్ల కళ్ళజోడు పెట్టుకుని స్టైల్ గా స్టిల్ ఇచ్చారేంటి? అనుకుంటున్నారా! ఇది స్టైల్ స్టిల్ కాదు గానీ, కళ్ళజోడు పెట్టుకుని కేసీఆర్ నిల్చున్న ఈ స్టిల్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన కంటికి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కేసీఆర్ దిగిన ఫోటో ఇది. ఎప్పుడూ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ కోపంతో రగిలిపోయే కేసీఆర్ ను చూసిన కళ్ళకు, ఈ ఫోటో ఒక్కసారిగా అవాక్కు చేస్తోంది. రొటీన్ కు భిన్నంగా ఉంటే వాటిని అక్కున చేర్చుకునే నెటిజన్లు, ఈ తెలంగాణా ముఖ్యమంత్రి వర్యుల ఫోటోను ఓ రేంజ్ లో ఆదరిస్తున్నారు. నిజానికి ఈ ఫోటోలో ఆ సత్తా ఉంది కూడా! బ్యాక్ గ్రౌండ్ లో కేసీఆర్ తనయురాలు కవిత చిరుదరహాసం ప్రదర్శిస్తున్న వైనం మాదిరే నెటిజన్లు కూడా ఓ చిరుదరహాసాన్ని ప్రదర్శిస్తున్నారు.