KCR - Harish Raoతెదేపా, తెరాస పొత్తుపై వూహగానాలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. విశేషం ఏంటంటే రెండు వైపులనుండి ఇప్పటివరకు దీనిని గట్టిగా ఖండించిన వారు లేరు. పైగా తెరాస మంత్రులు వాటికి ఊతమిచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న వారికి అంతో ఇంతో ప్రజా వ్యతిరేకత ఉండటం సహజం.

ఆ లాస్ను టిడిపి తో పొత్తు వల్ల వచ్చే 5-6%ఓట్లతో పూడ్చుకోవాలని కేసీఆర్ వ్యూహం. ఐతే తెదేపాతో పొత్తుకు మరో కారణం ఉండి ఉండొచ్చని పుకార్లు షీకరు చేస్తున్నాయి. తెలంగాణా ప్రభుత్వంలో రోజురోజుకూ కేటీఆర్ కు పెరుగుతున్న ఇంపార్టెన్స్ ను హరీష్రావు జీరించుకోలేక పోతున్నాడట.

ఏ సమయంలోనైనా హరీష్ రావు కేసీఆర్ పై తిరుగుబాటు చేసి తెరాసలో చీలిక తెస్తాడని ఆయన భయం అట. తెలంగాణా రాష్ట్ర సమితిలో హరీష్ కు ఉన్న విస్తృత పరిచయలతో ఎప్పుడైనా 20 మంది ఎంఎల్ఏలను హరీష్ ఆకర్షించగలడు అని కెసీఆర్ అనుమానం. కావున వచ్చే ఎన్నికల్లో తెదేపాతో పొత్తు పెట్టుకుని వీలైనన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలని కెసీఆర్ వ్యూహం అట.

హరీష్ కూడా తెలంగాణాలో ఆధారణ కలిగిన నేత. ఉద్యమసమయంలో కీలక భూమిక పోషించారు. హరీష్ వైపు కాంగ్రెస్ ఆశగా చూస్తుందని సమాచారం. హరీష్ ఎప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి పీఠం ఇవ్వడానికి కాంగ్రెస్ కూడా సిద్ధంగా ఉందట. వీటిని అన్నిటినీ లెక్కించి కేసీఆర్ తెదేపాతో పొత్తుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు చంద్రబాబు ఈ విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నారు. టిఆర్ఎస్ తో టిడిపి పొత్తు ఉన్నట్టు ఐతే ఆ ప్రభావం ఆంధ్ర రాజకీయాలపై కూడా తప్పకుండా ఉంటాడి. అటువంటి సందర్భంలో మొదటికే మోసం జరగొచ్చుకూడా. ఐతే పొత్తు ఉంటే మాత్రం తెదేపాకు తెలంగాణాలో ప్రస్తుతానికి ఆక్సిజన్ దొరికినట్టే.